కాఫీ విత్..‌ఆర్ రమాదేవి పొయెట్రీ..792-ఎ.రజాహుస్సేన్

(ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా)
*కాఫీ విత్..‌ఆర్ రమాదేవి పొయెట్రీ..792

*నీకూ నాకూ మధ్య తేలని లెక్కల్లో ఇదొకటి..!!
ప్రేమకవితల కవయిత్రి ఆర్.రమాదేవి మార్క్
కవిత ఇది.‌మీరూ ఓసారి ఈ కవిత చదవండి!!

“నువ్వు నాతో ఉన్నావో లేదోనన్న
ఆలోచనకు చోటెక్కడ..
నీవెప్పుడూ చిటికెలో వస్తానంటూ
సమయాన్ని భుజానికెత్తుకొని
ఎక్కడెక్కడో పంచిపెడుతుంటావు...
నాకై సమయాన్ని
దాచుకుని వస్తావని ఎదురుచూస్తూ..
నా సమయాన్ని కూడా 
పూర్తిగా నీకు అప్పజెప్పి నిలుచుంటాను..
నీకు నాకు మధ్య
తేలని లెక్కల్లో ఇదొకటి…”
            *ఆర్.రమాదేవి..!!

ప్రేమలోనో లెక్కలుంటాయి..అందులో కొన్ని తేలేవి.
ఇంకొన్ని తేలనివి.‌ఈ ప్రేమలో లెక్క మాత్రం తేల్లేదు.
అతగాడు చిటికెలో వస్తానంటూ,సమయాన్నిభుజానికెత్తుకొని ఎక్కడెక్కడో పంచిపెడుతుంటాడు..తన
కోసం అతగాడు సమయాన్ని దాచుకునివస్తాడని ఆమె ఎదురు చూస్తూవుంటుంది. పనిలో పనిగాతన
సమయాన్నికూడా పూర్తిగా అతగాడికి అప్పజెప్పి .. నిలుచుంటుంది ఆమె..ఇక్కడే లెక్క తేలటంలేదు..
అతగాడు తనకోసం సమయం దాచుకొనివస్తాడని ఆశపడి,తన సమయంకూడా అతనికిచ్చేస్తే..అతగాడి జాడే లేదు.‌.

తన కోసం ఎదురుచూస్తున్న ఆమెకు అతగాడు కనబడిందీ లేదు.‌లెక్క‌ఎక్కడో తప్పింది..అతగాడుతనక సమయం ఇస్తాడనుకుంటే….చివరకు తన సమయం కూడా అతగాడి చేతిలో పెట్టేసిందామె.ఆమె ఇప్పుడు ఒంటరిది..
తనకు తోడెవరూ లేరు‌‌తోడుంటాడనుకొని ఎదురు చూసీ,చూసీ తన సమయం కూడా పోగొట్టుకొంది.


ఆమె…మరిప్పుడెలా.? ఈ ప్రేమ లెక్కతేలేదెలా?
మీకేమైనా తెలిస్తే…ఆమెకు చెప్పంండి ప్లీజ్…!!

*ఎ.రజాహుస్సేన్..!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!