*కాఫీవిత్ "ఆర్ రమాదేవి …పొయెట్రీ ..610

*ఓయ్..! ఆ బొమ్మ కోసమే కాదు..నీ కోసమూ
నా  కళ్ళు వెదుకుతున్నాయ్ ..!!
రమాదేవి తన కవితకు వస్తువు ఏది తీసుకున్నా.‌
అందులో ప్రేమను రంగరించడం మామూలే..ఈ కవిత కూడా అలాంటిదే,
చిన్నప్పుడు బొమ్మకోసం,పెద్దయ్యాక ప్రియసఖుడి కోసం వెదుకులాట ఆమె
ది.బొమ్మైనా,అతడైనా మనసుతో ముడిపడిపడటం వేరే చెప్పాలా?ఓ సారి అలా మనసులో బొమ్మ
పడితే…జీవితపర్యంతం అలానే వుంటుంది. ఈ రోజు కాఫీ టైమ్లో ఆర్.రమాదేవి కవితను విశ్లేషించే
ముందు మీరూ ఓ సారి చదవండి..!!

"చిన్నప్పుడు ఎప్పుడో
నా నుంచి  బొమ్మ లాక్కున్నప్పుడు
వెక్కివెక్కి ఏడ్చాను నా బొమ్మ అని
ఊరడించడానికి అమ్మ మరో బొమ్మ ఇస్తానంది
అమ్మ ఇచ్చిందో లేదో నాకు గుర్తులేదు
ఏడుపు మరిచానో లేదో గుర్తు లేదు
బొమ్మలు కనిపించిన చోట
ఆగిపోవడం గుర్తుంది...
పోగొట్టుకున్న బొమ్మను 
వెతకడం గుర్తుంది....
కాలం గడిచిపోతూనే ఉంది
బొమ్మ ఆనవాలు కళ్లకు గుర్తుందో లేదో
మది తెలుసుకోగలదో లేదో తెలియదు
అయినా ...ఇప్పటికీ
బొమ్మలు కనిపించిన చోట
కాలు ఆగిపోతూనే ఉంది ...
కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి...
ఓయ్..!
అచ్చంగా
మారుపలకని నీకోసం
నిలువెల్లా కళ్ళేసుకొని
వెతుకుతున్నట్టుగా....."..!!
       "ఆర్.రమాదేవి…!!

ఇందులో ఓ చిన్న కథ వుంది.చిన్నప్పుడు ఆమె
చేతిలో వున్న బొమ్మను లాక్కున్నారు.ఆమెకెంతో
ఇష్టమైన బొమ్మను లాక్కున్నప్పుడు ఆమె వెక్కి ..
వెక్కి ఏడ్చింది..తన బాధను అమ్మతో చెప్పుకుంది.
ఏంచేయాలో తెలీక అమ్మ ఊరడించే ప్రయత్నం చేసింది..పోతే …పోయిందిలే..! నీకు మరో బొమ్మ కొనిస్తానులే అంది.అప్పడు అమ్మ మరో బొమ్మను  కొని ఇచ్చిందో లేదో ఇప్పుడామెకు గుర్తులేదు..
అమ్మ సముదాయించినప్పుడు బొమ్మకోసం ఏడు
పు మరిచిందో లేదో కూడా ఇమెకు గుర్తు లేదు…
అయితే…అప్పట్లో బొమ్మలు కనిపించిన చోటల్లా
ఆగి,తను పోగొట్టుకున్న బొమ్మను వెతకడం….
మాత్రం గుర్తుంది….

కాల చక్రం గిర్రున తిరిగింది..ఇప్పుడామెకు బాల్యం
లో పోగొట్టుకున్న బొమ్మ ఆనవాలు కళ్లకు గుర్తుందో లేదో కూడా తెలీదు.కవేళ ఇప్పుడా బొమ్మ ఒకవేళ
కనబడ్డా,గుర్తు పడుతుందో లేదో కూడా తెలీదు.
అయినా ఇప్పటికీ ..‌‌
బొమ్మలు కనిపించిన చోట ఆమె కాళ్ళు ఆగిపోతూ
నే ఉన్నాయి.కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి…!
ఇంత వరకు సాఫీగా సాగిన ఈ కథ ముగింపు
కొచ్చేసరికి…రమాదేవి తన మార్కు మెరుపును
చూపించింది…

తను బొమ్మకోసం ఎలా వెదుకుతోందో మనసులోనే
అతగాడికి చెబుతోంది…
"ఓయ్..!
అచ్చంగా మారుపలకని నీకోసం నిలువెల్లా కళ్ళే
సుకొని వెతుకుతున్నట్టుగా బొమ్మను వెదుకు…
తున్నా"నంది.!
రమాదేవి కవితలో కనబడేది ఊహా ప్రేయసీ… ప్రియులే…లేనిది వున్నట్టుగా ఉహించుకుంటూ
తన మనసులోని "వియోగ" బాధను వ్యక్తం చేయ
డం ఈమె ప్రేమ కవిత్వంలోని ప్రధాన లక్షణం..!
భావకవిత్వంలో ఊహాత్మక ప్రేయసిని ఊహించు
కుంటూ,కలలుగంటూ కవిత్వం అల్లడం చుశాం..
రమాదేవి కవిత్వంలో భావకవిత్వ ఛాయలున్నా.‌. కొంత పక్కకు జరిగి తనదైన ముద్రతో కవిత్వం
రాస్తోంది..భావకవిత్వం గురించి విశ్లేషించినపుడు
ఇప్పుడీ కొత్త ప్రేమకవితా వైఖరిని తప్పక ప్రస్తావించాలి.ఇదో రకమైన ప్రత్యేక స్కూలు.దీనికి "గీతా
వెల్లంకి " ప్రిన్సిపాలైతే,.ఆర్ రమాదేవి‌ వైస్ ప్రిన్సిపాల్ అనొచ్చు…!!

*ఎ.రజాహుస్సేన్…!!
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!