నీ కోసం ఓ లేఖ

నీకోసం ఒక లేఖ రాయాలని
అనుకున్న సమయాన.......

పగలు తలవంచి రాత్రి ముసుగు వేసుకొని
ఎదురొస్తుంది.... దారులన్నీ ఒక్కసారిగా
మూసుకుపోతాయి... కంటికి కనిపించని రహదారులు
మనసుతో చూడాలి కాబోలు..
ఎక్కడో ఒకచోట మనసుకు బుద్ధికి పొందన కుదరదు...
మనసు నాది అంటుంది... ఆలోచనలు కాదు పొమ్మంటాయి ...

ఒకరు అవునంటేనో కాదంటేనో ఆగిపోవు మనసు సొగసరి నడకలు.. ...
నా మనసు మరీ రాలుగాయి కాబోలు.. మాట వినదు..

ఎక్కడో పారిజాత పూలు దోసిట రాలుతుంటాయి...
అనుకోకుండా వినిపించిన అడుగుల సవ్వడితో
దోసిట్లో పూలు నేలారాలాయి...
బెదిరిన మనసు ..తెరతీయని కళ్ళు...
ఆరవిచ్చిన గులాబీలా చుట్టూ చూస్తాయి..
అందులో ఉన్న భావం
పూలను జార విడిచిన వారి సొంతమే కదా..

అవును!! అవి ఎప్పుడో ఎక్కడో జారవిడిచిన అడుగులు...
రాతిరివేళ కనుమరుగైన రహదారిలా...
జాడ కనుమరుగైన అడుగులేనోయ్..

కాలం వడిలో కరిగిపోతూ...
నాకు తెలియకనే ఓ రహద్యపు గుహలో నిక్షిప్తమైన మరకతంలా ...
నా కనుచూపుకు అందనంత దూరములో...
ఆనవాలు ఒకటి ఒదిగిపోయింది నిశ్శబ్దంగా...

అవును.. అక్కడే .. ఎప్పుటినుండో వేచి ఉందేమో
అలా.. నా మనసు అడుగుల కోసం ... అందుకే కాబోలు
ఇపుడు మనసు అల్లరి పెడుతోంది ఆచూకీ కోసం...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!