ఉత్సవ సౌరభం... లేఖ

ఈ లేఖ April 2020 లో వాడ్రేవు లక్ష్మి గారికి రాసినది.. .. అందరితో పంచుకోవాలని ఆశతో..ఇప్పుడు ఈ పోస్ట్)

వాడ్రేవు లక్ష్మి గారికి

మీ పుస్తకం ఉత్సవ సౌరభం చదివాను అండి... చదివాను అని చిన్న పదంతో సరిపోల్చడం సరికాదేమో..... కథలను ఆస్వాదించాను అని చెప్పినా కూడా సరిపోదేమో అంతకన్నా అద్భుతమైన పదము ఏదైనా కావాలి .. పుస్తకంలోని కథలు ఎంత బాగున్నాయి అని చెప్పడానికి... అవన్నీ మనసుపెట్టి చదవాల్సిన కథలు.. మనిషికి కావాల్సిన కథలు....
ఇందులో ఒక కథ కావచ్చు, కొన్ని కథలు కావచ్చు కానీ ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట తన జీవిత భాగాలని తప్పకుండా గుర్తు చేస్తుంది..

అయినా ఇందులో కథలు గురించి చెప్పడానికి ఇంకా ఏమీ మిగల లేదేమో... వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఫలశృతి లో ప్రతి వాక్యాన్ని సృజిస్తూ చాలా విషయాలు చెప్పారు.. అంతకంటే ఒక్క మాట కూడా ఎక్కువ చెప్పడానికి అద్భుతపదాలు అంటూ ఏమీ నాకు దొరకడం లేదు..

వెన్నెల కౌగిలి ఇది కథ కావచ్చు కానీ జీవితంలో ఒక సమస్య కి అన్వయించుకుంటే జవాబు దొరకడం కష్టమేమి కాదు.. ఈ కథలో దాగి ఉన్న సమస్య అప్పుడే కాదు ఇప్పుడు ఉంది.... బహుశా కనుమరుగు కావడం కష్టమేనేమో... ఆర్థిక సమస్య అన్నది ఒక్కటే సమస్య కాదు... నిజమే..మనిషి సమస్య.. మనసు సమస్య.. చాలా అందమైన రేఖతో విభజించారు... చాలా చక్కటి కథ ..

ఉత్సవ సౌరభం... . కొన్ని విషయాలు ఎందుకో మనసుకు అందకుండానే దాగుడుమూత లాడుతూ ఉంటాయి..ఒక పనిని చేయకూడదు.. ఇష్టం లేదు అని మనసుకు తెలిసిందినంత తొందరగా ..ఎందుకు ఇష్టం లేదో మనసుకు తెలియడం  ఒకింత కష్టమైన పనే... మీ కథ చదవగానే మనసు మీది ఒక పలుచటి తెర అడ్డు తొలగినట్టయింది...

ఈ కథ చదవడం తోటే ఆ రోజుకి పుస్తక పఠనం ఆగిపోయింది ఎందుకో తెలియదు కానీ ఆ కథ నన్ను వదిలి పెట్టలేదు...ఎన్నెన్నో జ్ఞాపకాలు తోటి గడిచిపోయింది నిజం చెప్పాలంటే ఒక ఊహా జగత్తు లోకి వెళ్ళిపోయింది నా మనసు...

మరుసటి రోజు మరో కథ చదవడానికి ముందు ఫలశృతి చదవడం మొదలు పెట్టాను. అది చదివాక అనిపించింది నిజమే కథ చదవగానే వెంటనే ఇంకో కథ చదవాలి అని అనుకోకుండా.. అక్కడే ఆగి పోవడానికి కారణం..

చిన వీరభద్రుడు గారు చెప్పినట్టు... ఈ కథలు మెల్లిమెల్లిగ హృదయానికి హత్తు కోవాలి.

మంటలు ,కాలుష్యం..  కథలలో..మనసు ఉంది.... సమస్య ఉంది.. ఏమీ చేయలేని బేలతనం కూడా.. ఒకవైపు అభివృద్ధివైపు అడుగులు వేస్తూనే .. మరోవైపు మరోతరానికి అందకుండా కనుమరుగయ్యే వి ఎన్నో ఉన్నాయి.. ఇప్పటి తరం వీటిని కథలుగానే చదువుతుంది కాబోలు.. మనసుకు తగలడానికి ఆ అనుభూతులు చవి చూసి ఉండరు కదా.. అని అనిపిస్తుంది..

24 క్యారెట్..ప్రభావం.. ఈ రెండు కథలు కలిపి ప్రతివారూ తమ జీవితానికి అన్వయించు కోవచ్చు.
24 క్యారెట్ కథ.. ఏమి చేయాలో చెప్పింది ప్రభావం కదా ఎలా చేయాలో చెప్పింది...

ఏమి చేయాలో తెలియడం ఎంత ముఖ్యమో ఎలా చేయాలో కూడా తెలియడం అంతే ముఖ్యం  అని అనిపించింది... ఎలా చేయాలో తెలియక పోతే ఆ మంచి మనసు ఆ తరానికి ఆగిపోతుంది...

శిలాపుష్పం.. ఈ కథ అయితే ప్రతి తల్లి చదవాలేమో...వాళ్ళ పిల్లలలోని character బలపరచడానికి... అక్కా చెల్లెలు చెప్పుకునేంత ఉన్నాయో లేదో కానీ... తల్లి తన పిల్లల్ని అర్థం చేసుకుంటే వాళ్లకు అండగా నిలిచి ఉంటే అంతకంటే అద్భుతం ఇంకేమి ఉండదు అనిపించింది...

లో వెలుగు.. సంస్కారం ఈ రెండు కథలు మనసు కథలు... ఎంతటి అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందో రెండు మాటలలో చెప్పడం చాలా కష్టం ఈ రెండు కథలను మీరు చెప్పిన తీరు అత్యద్భుతంగా ఉంది... మనసు వైరాగ్యాన్ని ఈ కథలు చిటికెలో మాయం చేస్తాయి... అలసిన మనసుకు.. ఉలి దెబ్బతిన్న మనసు.. ఏదైనా కానీ వాటికి ఇవి మకరందం లాంటి ఔషధమే

బీ వేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.. కథలో జీవితంలో మనిషికి కావలసిన ఆయువుపట్టు గురించి చెప్పకనే చెప్పారు..మనిషి జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా తనను తాను మరవక పోవడం ఎంత ముఖ్యమో చెప్పడం... ఈ కథలోని ప్రభావతి నాకు చాలా నచ్చింది...
ప్రభావతి లాంటి వారు ఎందరో ఉండొచ్చు... గుర్తించలేము కాబోలు..

వెన్నెల ముగ్గు... ఈ కథ ప్రతి ఇంట్లో ఉంటుందండి ..కాకపోతే అది ఒక సమస్య కిందనే అనుకోరు ... ఇవే పెరిగేకొద్దీ జీవితం బోర్ కొడుతుంది ..నాకు తోచడం లేదు ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి..

మీ ప్రతీ కథా బాగుందండి... ప్రతి కథ ఒక ఒక ప్రత్యేకత.. ఏదో ఒక సమస్యను సృజిస్తూ... పరిష్కారానికి ఒక ఆనవాలుగా... సన్నని గీత
గీస్తూ.. చాలా చక్కటి ముగింపు పలికారు...

మీ కథలన్నీ చెప్పాలి ఒక మాటలు అంటే... ఈ కథలన్నీ మనసు కథలు...
అందరూ మనిషి సమస్యల గురించి చాలా మాట్లాడుతారు...
ఆర్థిక సమస్యల గురించి ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడని మనిషంటూ ఉండరు...
కాని మనసు అనేది ఒకటి ఉంటుందని దానికి ఒక సమస్య ఉంటుందని ..

మనసుకు పరిష్కారం తెలిసిన ఆచరించలేని మనుషులు ఉంటారని..
మనసు కోసమే పోరాడే మనుషులు ఉంటారని...
ఒక మనిషి చెప్పిన మనసు అనుభూతి విన్న మరోమరో మనిషి కూడా అంతటి అనుభూతి పొందుతారని..పొందవచ్చని...
మనసు ఆరాటపడితే సరిపోదని..అందుకునే ప్రయత్నం చేయాలని...
ఎన్నో ఎన్నెన్నో చెప్పాయి మీ కథలు....మీరు...

మీ కథల గురించి ఎంత చెప్పినా తక్కువే...
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!