ఓషో..చెప్పిన 'ఆనందం'

ఓషో (రజనీష్) రచనల్లో ' ఆనందం' (osho - joy) ఒకటి.. ఇది సామాన్యమానవుడి అతి చిన్న సందేహాలకు ..మనసు మెచ్చే జవాబులకు ఆలంబనగా నిలుస్తుది ఈ పుస్తకం.. ఆధ్యాత్మిక గందరగోళపు ఎడారిలో ఉన్న నాకు ఇది ఒక ఒయాసిస్ లా కనిపించింది అంటారు ఈ పుస్తక అనువాదకురాలు.. ఆనందంగా జీవించడానికి కావాల్సింది మనిషి అరచేతిలోనే ఉందని అంటారు ఓషో ...సంతోషంగా ఉన్నానని చెపితే ఎందుకు ఎవరు నమ్మరని ప్రశ్నిస్తారు  ఓషో.

ఓషో జ్ఞానసిద్ధి పొందిన గురువు.
ఆత్మజ్ఞానాన్ని మనిషిలో మరింత
వృద్దిపరచటానికి వీలైనన్నిమార్గాల ద్వారా కృషి చేస్తున్నారు
..

- దలైలామా

'ఆనందం' ముందుమాట...మీ కోసం

"మా డాక్టర్ మిమ్మల్ని తప్పనిసరిగా చూడమని చెప్పారు. "ఒక రోగి మానసిక శాస్త్రవేత్తతో అన్నాడు. "ఎందుకో నాకు తెలియదు - సంతృప్తికరమైన వివాహ జీవితం, సురక్షితమైన ఉద్యోగం. చాలామంది స్నేహితులు, బాధలు లేవు."
ఉత్సాహంగా నోటు పుస్తకాన్ని అందుకుంటూ "ఈ విధంగా ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు అన్నారు మనస్తత్వ శాస్త్రవేత్త."

సంతోషంగా ఉండటం నమ్మశక్యం కానిది. మనిషి సంతోషంగా ఉండలేడట. నీ నిరుత్సాహం గురించి, దైన్యం గురించి మాట్లాడితే అందరూ నమ్ముతారు. అది సహజం అనిపిస్తుంది. నీ సంతోషం గురించి నువ్వు మాట్లాడితే నిన్ను ఎవ్వరూ నమ్మరు - అది అసహజంగా అనిపిస్తుంది.

40 సంవత్సరాలు వేలాది మనుషులతో కలిసి పనిచేసి, వేలాది కలతపడ్డ మనసులను శోధించి మానవ మస్తిష్కం గురించి పరిశోధన చేసిన 'సిగ్మండ్ ఫ్రాయిడ్' సంతోషం కేవలం కల్పన అనే నిర్ణయానికి వచ్చాడు : మనిషి సంతోషంగా ఉండలేడు. కొంతవరకు పరిస్థితులను మెరుగు పరుచుకోవచ్చు. మహా అయితే దుఖాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు, కానీ సంతోషం? అది మనిషి దగ్గర లేదు.

ఇది నిరాశావాదంగా ధ్వనిస్తుంది... కాని నువ్వు మానవజాతిని పరిశీలిస్తే అదే నిజం అనిపిస్తుంది. ఒక్క మనుష్యులే సంతోషంగా లేరు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది.

ఇది నేను మీకు నా స్వాదికారంతో చెబుతున్నాను. మనుష్యులు పక్షులకన్నా, చెట్లకన్నా, నక్షత్రాలకన్నా సంతోషంగా ఉండగలరు. ఎందుకంటే ఏ చెట్టుకీ, పక్షికీ, ఏ నక్షత్రానికీ లేని చైతన్యం వారిలో ఉంది.

మనుష్యులు విపరీతంగా సంతోషంగా ఉండగలరు. చాలా దుఖంతోనూ ఉండగలరు. వారికి ఏది కావాలో నిర్ణయించుకోవడమే. ఈ స్వేఛ్చ అపాయకరమైనది. ఈ స్వేఛ్చ చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే దానికి నువ్వే బాధ్యత వహించవలసి ఉంటుంది. మనిషి స్వేచ్చకి ఎక్కడో, ఏదో తప్పు జరిగింది. మనిషి తలక్రిందులయ్యాడు.

మనుష్యులు ధ్యానాన్ని అన్వేషిస్తున్నారు. మీరు సంతోషంగా ఉండడానికి నిర్ణయించుకోలేదు కనుక, ధ్యానం అవసరం అయింది. సంతోషంగా ఉండడానికి నిర్ణయించుకుంటే ధ్యానావశ్యకతే లేదు. ధ్యానం రోగానికి మండులాంటిది. నీకు జబ్బు చేస్తే మందు అవసరం ఉంటుంది. ఒకసారి సంతోషాన్ని కోరుకోవడం మొదలెడితే, సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంటే ధ్యానం అవసరం ఉండదు. దానంతట అదే మొదలవుతుంది.

నువ్వు చేస్తున్న పనిని నువ్వు ప్రేమిస్తే, నీ జీవన విధానాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు ధ్యానిస్తున్నట్లే. అప్పుడు ఏది నీ మనస్సుని మళ్ళించలేదు. ఏదైనా నీ ఏకాగ్రతని చెదరగొడితే, నువ్వు చేస్తున్న పనిపట్ల నీకు శ్రద్ద లేదన్నది తెలియచేస్తుంది.

ధనం, ప్రతిష్ఠ, అధికారం లాంటి అసహజమైన వాటిలోకి మనం మళ్ళింపబడ్డాం. పక్షుల పాటలు వింటుంటే ధనం లభించదు. అలా వినడం వలన అధికారం, ప్రతిష్ఠ లభ్యం కావు. సీతాకోకచిలుకని చూస్తుంటే ఆర్ధికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇవన్ని లబ్ధిని చేకూర్చవు కానీ నిన్ను సంతోషపెడతాయి.

తనకి సంతోషం కలిగించే వాటితోనే సాగే ధైర్యం నిజమైన మనిషికి ఉంటుంది. అతడు బీదగానే ఉంటాడు. దానిపట్ల అతడు ఎలాంటి అభియోగం చేయడు. అతనికి ఏ విధమైన అయిష్టత ఉండదు. "నా దారి నేను ఎన్నుకున్నాను - పక్షులని, సీతాకోకచిలులకలని, పువ్వులని, నేనే ఎన్నుకున్నాను. నేను ధనికుడిని కాలేను. అయినా ఫరవాలేదు నేను ధనికుడినే. ఎందుకంటే నేను సంతోషంగా ఉన్నాను కనుక" అని అంటాడు. కానీ మానవులు తలక్రిందులయ్యారు.

నేను ఎక్కడో చదివాను..
కొన్ని గంటలు వృద్దుడు నది ఒడ్డున కూర్చొని గాలం వేశాడు. ఒక్క చేప కూడా పడలేదు. సీసాల కొద్ది తాగిన బీరు, సూర్యుడి తీవ్రత వలన అతడు కునికిపాటు పడ్డాడు. ఒక పెద్ద చురుకైన చేప గాలానికి తగిలింది. దానికి సంసిద్దుడుగా లేడు. సమతుల్యత లేకపోవడంతో నదిలో పడ్డాడు.

ఒక చిన్న కుర్రవాడు జరుగుతున్నదంతా ఆశక్తిగా గమనించాడు. నదిలో నుంచి బయటికి రావడానికి అతడు పెనుగులాడుతున్నప్పుడు, ఆ కుర్రవాడు తన తండ్రిని అడిగాడు. " నాన్నా, ఆ మనిషి చేపను పడుతున్నాడా లేక ఆ చేప మనిషిని పడుతుందా? అని ...
మనిషి పూర్తిగా తలక్రిందులయ్యాడు. నువ్వు చేపని పట్టుకోవడం లేదు. చేపే నిన్ను పట్టుకుని లాగుతుంది. ఎక్కడ ధనాన్ని చూసినా నువ్వు నువ్వుగా ఉండడం లేదు. ఎక్కడ అధికారం, ప్రతిష్ఠ చూసినా నువ్వు నువ్వుగా ఉండడం లేదు. అంతా మరచిపోతున్నావు. నీ ఆనందం, నీ సంతోషం, నీ ఆహ్లాదం - సహజ సిద్దంగా ఉండే నీ జీవితపు విలువలు అన్నింటినీ మరచిపోతున్నావు. బయటి నుంచి ఏదో ఎన్నుకునే, నీలో ఉన్న దేనినైనా పోగొట్టుకోవటానికి సిద్దపడుతున్నావు. లోపలిది పోగొట్టుకుని బయటిది పొందున్నావు.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!