జై సోమనాథ్

ఇస్లాం అడుగుపెట్టిన ప్రతి నేలా ఇస్లామీకరణం చెందింది. కాని, భారతావని మాత్రం ఇస్లాం కు తలవంచలేదు.వేయ్యండ్లు ఇస్లాం రాజ్యం చేసిన ఎందుకు భారతదేశం తలవంచలేదు? దానికి కారణం ఆనాటి ప్రజలు  అంకుటిత దీక్ష , పట్టుదలలే కారణం.తన మతం , సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలు చేసారో, ఎంత పోరాటం చేసారో వాటిని వ్రాసి పెట్టి భద్రపరిచే కల్హణుడు వంటి చరిత్రకారులు మనకు లేకపోవచ్చు. ఆనాటి మానవ చరిత్రతో
పోల్చితే హిరోషిమ, నాగసాకీ , నాజీలు యూదు జాతి నిర్మూలన ఎందుకు పనికిరావు.ఆనాటి ప్రజలు పోరాటాస్పుర్తి, త్యాగం, పట్టుదల మనకు కళ్ళకు కట్టినట్టు చూపే దృష్టాంతాలు ఎన్నో.అటువంటి వాటి లో తలమానికమైనది సోమనాథ్ చరిత్ర.

జై సోమనాథ్ నవల, గజినీ సాగించిన క్రూరమైన దమనకాండ, దోపిడీ, ఆ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి నడిపిన ప్రచండ పోరాటం, యావత్ హిందుజాతికి శ్రాద్దాకేంద్రమైన సోమనాధాన్ని కాపాడుకోవడానికి ప్రజల ఆరాటం, ఆనాటి ప్రభువుల సంకుచిత స్వభావం ఆనవసర భేషజాలు , స్వార్ధ ప్రయోజానాలు కోసం ఎంతవరుకు పతనమైనదీ చక్కగా వివరించింది.

ఈ నవల చదవటం మెదలపెట్టితే ఆపడం మన తరం కాదు.రచయత ఆనాటి కాలమాన పరిస్థితులు చక్కగా వివరించాడు.శైవమతం, వాటి లో శాఖలు వాటి మధ్య భేదాలు వివరణ బాగుంది.గజినీ దండయాత్ర వార్తా తో ఈ నవల మెదలవుతుంది . సోమనాథ్ ముఖ్య పూజారి అయన శ్రీ గంగ సర్వజీడు అనుమతి తో గజినీ వచ్చే దారి లో రాజులు ను సమాయత్తం చేసే పని మీద ఘోఘా వంశ రాజులు అయన సామంతుడు, సజ్జనుడు ఎడారి లో ప్రయాణం చేస్తారు.ఇక్కడ రచయత కల్పనా చాతుర్యం ఆమెఘాం . ఎందుకంటే మనం కూడా వారి వెంట ఎడారి లో ప్రయాణించే అనుభూతి పొందుతాము.


ఆనవసర వీరప్రతాపాలుకు పొయ, ఉత్తి పుణ్యానికి శత్రువు చేతిలో హతం అయిన ఘోఘాబాబా ను కథ చదివితే మనకు చాల ఆశ్చర్యం ,కోపం,బాధా కలుగుతాయి.శత్రు సైన్యం లక్షలలో ఉన్నాకూడా ఏ మాత్రం భయపడకుండా తన వద్ద కేవలం 500 మంది సైన్యం తో చనిపోతాం అని తెలిసికూడా ఘోఘాబాబా 80 ఏళ్ళ వయసు లో యుద్ధం చేస్తాడు.అదే సమయం లో మనకు శత్రువు ని వెనక నుండి దొంగదెబ్బ తీస్తూ గెరిల్లా పోరాటం చేసి వుంటే చాలా బాగున్ను అనిపిస్తుంది.జాలోర్ రాజు అయిన వాక్పతి రాజుధీ మరొక నీచమైన కథ. గజని డబ్బులుకి ఆశపడి సోమనాథ్ మీద దండయాత్రకు దారి ఇచ్చిన నీచుడు.అటువంటి రాజూలు ఆనాటి భారతం లో కోకొలల్లు. అటువంటి వారిలో పరషపురం మంత్రి అయన తిలకుడు, ములాస్తానం రాజు అయిన ఆజయపాలుడు

పాట్న (సోమనాథ్) రాజుయైన భీమదేవుడు గజనిని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం చర్చకు వచ్చినప్పుడు ఆనాటి రాజులు ఆహంభావం, కొత్త విషయాలు పై ఆవగాహన లేకపోవడం తెలుస్తుంది.

గజినీ వచ్చాడు,ప్రభాసాన్ని నేలమట్టం చేసాడు, విగ్రహాన్ని పగలగొట్టాడు, కాని దీని వల్లనా అతనికి కొంచమైన లాభం కలగలేదు. సాహసంగా దీపావళి చేసినందుకు అతనికి చిక్కిన్దల్లా భూడిద ,దుర్గంధం మాత్రమే. గజినీ చాలా తక్కువ సైన్యంతో ముప్పతిప్పలు పడి తన రాజ్యానికి చేరుకొంటాడు. భీమదేవుడు సోమనాథం నేలమట్టం అయినచోట మరింత గొప్పగా సరికొత్త దేవాలయం కట్టిస్తాడు. కాని పంతం పట్టి గజినీ వెళ్లి గజినిని ఓడించగల మరో గజినీ మనకు కరువుయ్యాడు

ఈ నవల వ్రాసింది గుజురాతీ రచయిత KM మున్షీ, ఇతను రాజ్యంగా నిర్మాణం కమీటి లో సభ్యులు. తెలుగు లోకి అనువాదం చేసింది భండారు సదాశివరావు.అనువాదం చాలా చక్కగా సరళంగా వుంది. ఈ పుస్తకం దొరికితే తప్పక చదవండి.

 


Comments

Post New Comment


Nemali Kunche 11th Jun 2011 05:02:AM

చరిత్ర లో చాల విషయాలు అందరికి తెలియవు, కాని అవి తెలసుకుని అందరికి పంచటం అనేది గొప్ప విషయం. చాల చాల కృతజ్ఞతలు.