ప్రేమంటే..హచికో కి జపాన్ నివాళి

ప్రేమంటే ఒక చిన్న పదంలోనో వాక్యం లోనో చెప్పలేనిది..నిజంగా చెప్పాలంటే ఒక నిర్దిష్టమైన రూపకల్పన చేయలేని భావతరంగం.. అందులోని కొన్నిభావ వీచికలే ఆప్యాయతా, అనురాగం, ఇష్టం అని చెప్పబడే అనేక చిన్ని పదాలు. ..ఇరువురి మనుషుల మధ్య మాత్రమే లేదా స్త్రీ - పురుషుల మధ్య మాత్రమే ప్రేమ అంకురించడం లేదా ప్రేమ ఉంటుంది అని చెప్పడం ఒక విధంగా తప్పు అభిప్రాయమే..ప్రేమ అనేది రెండు జంతువుల మధ్య , ఒక మనిషి - జంతువూ మధ్య, మనిషి - చెట్టు మధ్య కూడా కావొచ్చు..జీవం ఉన్నా ఏ రెండిటి మధ్య లేదా  ఒక గుంపుయందు ఉండవచ్చు. ప్రేమించేవారు కానీ, ప్రేమించబడేవారు  కానీ ప్రేమను ఆస్వాదించగలరే కానీ ప్రేమా అనేదాన్ని నిర్వచించలేరు. ప్రేమ ఆంటే రెండు మనసులు ఒక ఆత్మగా మారడం , ఇది రెండు హృదయస్పందనల కలయిక..అని చెపుతారు.

ప్రేమకు కొలబద్ద ఏమిటి.. ఒక బాల్యం వీడని యువతి యువకులు ప్రేమకోసం ఆత్మహత్య చేసుకోవడమా..లేక పెద్దలనెదిరించి పెళ్లి చేసుకోవడమా.. ఒక మనిషి మరణిస్తే అది తెలియగానే గుండె ఆగిపోవడమా.. ప్రేమకు చిహ్నం అని అందమైన కట్టడం కట్టడమా.. ఒక మనిషి వదిలిన కర్తవ్యాన్ని పూర్తిచేయడం కోసం ఉండడమా.. తిరిగి రాని మనిషి కోసం వేచి ఉండడమా.. మనకు తెలిసిన సత్యం వెనుక తెలియని కథలెన్నో ఉంటాయి,

జపాన్ లోని టోక్యో నగరంలో అడుగుపెడితే శిబుయ రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక కూర్చొని ఉన్న కుక్క కాంస్య  విగ్రహం కనపడుతుంది ఆ కుక్క పేరు హచికో (hachiko). అంతటి  ఉన్నత మైన పేరు రావడం వెనుక ఉన్నా కన్నీటి కథ హచికో కథ..

హచికో కథ(story of hachiko dog)

1923 నవంబర్, ఒడాట్(odate city) లో హచికో పుట్టింది, 1924 లో దాన్నిఇసబురో ఇనో( Eisaburo Ueno) అనే ఒక కాలేజి ప్రొఫెసర్ టోక్యో తీసుకువచ్చాడు. అతని వెంట రోజు ఆ కుక్క పిల్ల హచికో కూడా ప్రొఫెసర్ తో పాటు శిబుయ రైల్వే స్టేషన్ వరకు వచ్చి ఆతను రైలు ఎక్కి వెళ్ళేవరకు ఉండేది..మళ్లీ సాయంత్రం ఆతను వచ్చేవరకు అతనికోసం వేచి ఉండేది..యిలా 1925 మే వరకు జరిగింది. ఒకరోజు రోజులాగే హచికో మరియు ప్రొఫెసర్ రైల్వే స్టేషన్ కి వచ్చారు, ఆతను కోసం ఎదురుచూస్తూ ఉంది రోజులాగే హచికో.. కానీ అక్కడ ప్రొఫెసర్ హఠాత్తుగా సేరెబ్రల్  హేమరేజ్ (cerebral hemorrhage ) తో చనిపోయాడు. ఈ విషయం ఏమి తెలియని హచికో మాత్రం తన యజమాని కోసం ఎదురుచూడడం మొదలెట్టింది. ప్రొఫెసర్ రాకకై వేచి ఉండి ఇంటికి పరుగులు తీసింది అక్కడ ఆతను కనిపించకపోవడంతో మళ్లీ రైలు రాక కోసం ఎదురుచూస్తూ రైల్వే స్టేషన్ దగ్గరే ఉండిపోయింది.. ఒకరోజు రెండు రోజులు కాదు నెలలు గడుస్తున్న హచికో మాత్రం రోజు రైలు వచ్చేసరికి  తన యజమాని రాక కోసం పరుగులు పెట్టేది.

అక్కడ పనిచేసే ఉద్యోగులకు హచికో మరియు అతని యజమాని తెలుసు.. ఆ కుక్క ఆరాటం చూడలేకపోయారు.. ప్రతిరోజూ చూసే ప్రయాణికులు, అక్కడి సిబ్బంది కూడా హచికోకి ఆహారం అందించేవాళ్ళు.. కానీ అది బ్రతకడం కోసమే తిన్నట్టుగా ఉండేది ఒకోసారి కొన్ని రోజులు ఆహారం కూడా ముట్టేది కాదు..

అదే సంవత్సరం (1925)  మరణించిన హచికో యజమాని అయినా ప్రొఫెసర్  ఇసబురో ఇనో గారి స్టూడెంట్ ( one of Ueno's students ) ఒకరు, హచికోనీ రైల్వే స్టేషన్ నుండి అనుసరిస్తూ  కొబయషి ఇల్లు(Kobayashi home ) చేరాడు, అది ఒక్కప్పుడు ప్రొఫెసర్ ఉన్న ఇల్లే... కొబయషి  ద్వారా హచికో గురించి తెలుసుకొని, హచికో గురించి ఆర్టికల్ రాసాడు. యిలా ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నాడు. ఆ ఆర్టికల్స్  ప్రజలందరికి చేరి అందరు హచికో కోసం ఆరాట పడ్డారు..ఒక జపాన్ శిల్పి ఒకరు హచికో కాంస్య విగ్రహానికి రూపకల్పన చేసారు. దాన్ని  ఏప్రిల్,1934 లో శిబుయ రైల్వే స్టేషన్  ( Shibuya Station ) ఎదురుగా ప్రతిష్టించారు.

హచికో మాత్రం 1925 నుండి తన యజమాని కోసం ఎదురుచూస్తూనే, ఎన్నో ఆటు పోటులు తట్టుకుంటూ, విపరీతమైన వాతావరణ పరిస్థుల్లో కూడా హచికో తన ఎదురు చూపులతో అక్కడే ఉండిపోయింది..అలా ఎదురు చూసి చూసి మార్చ్ 8, 1935 లో మరణించింది. ఆ వార్త విని టోక్యో నగరమే తల్లడిల్లింది.. ఇప్పటికి ప్రతీ సంవత్సరం ఏప్రిల్ లో హచికో సంస్మరణ రోజు జపాన్ వాసులంతా జరుపుకుంటారు. హచికో స్టఫ్ చేయబడిన శరీరం నేషనల్ సైన్సు మ్యుజియంలో భద్రపరిచారు.

1938 లో ప్రతిష్టించిన విగ్రహం(hachiko dog statue) రెండవ ప్రపంచ యుద్ధం లో ద్వంసం అయితే మళ్లీ ఆండో తకేషి (Ando Takeshi ) అనే శిల్పి సృష్టించిన కచికో కాంస్య విగ్రహం 1948 లో తిరిగి ప్రతిష్టించారు.అలాంటిదే  మరొకటి  హచికో జన్మస్థలం  అయినా ఒడాట్ (odate) లో ప్రతిష్టించారు. మరొక   రాతివిగ్రహాన్ని 2004 లో ఒడాట్ (odate) ఆకిడు మ్యూజియం ఎదురుగా ప్రతిష్టించారు. అంతే కాకుండా ఎక్కడ అయితే తన యజమానికోసం ఎదురుచూసేదో సరిగ్గా అక్కడే హచికో కాంస్య పాదాలు ఉంచి జపాన్  ప్రజలు హచికో పై తమ అభిమానం వెల్లడించారు.

హచికో మరణం పై వివిధ కథనాలు వినిపించడం తో మార్చ్ 2011 లో హచికో మరణానికి కారణం పరీక్షించి తెలుసుకున్నారు.. హచికో టెర్మినల్ కాన్సెర్ మరియు ఫిలిరియా ఇన్ఫెక్షను  తో చనిపోయిందని నిర్ధారించారు.

ఎన్నో ప్రేమ కథలూ చదివి వుంటారు. అందరికి ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి ప్రేమ మీద...ఈ కథ చదివిన తరువాత ఎంతో ఉన్నతమైన ప్రేమ అనే మాటని నిజంగా ఉన్నతంగా అందరు వాడుతున్నారా అనిపిస్తుంది కదా!


Comments

Post New Comment


bora.ramakrishna 27th Dec 2012 18:44:PM

yes, it is true love.prema ante edi.because love is God. brk,narannapeta