యండమూరి...మంచుపూలు

యండమూరి వీరేంద్రనాథ్ (yandamoori veerendranath)  రచనల్లోనుంచి ఏరికూర్చిన సుభాషిత సంపుటం "మంచుపూల వర్షం" నుండి పాఠకుల అభిప్రాయం ప్రకారం అత్యుత్తమ రేటింగ్ ఇవ్వబడిన సుభాషితాలు..పార్ట్-2

విజయంలో భాగస్వామ్యం

  1. ఇల్లంటే ఎంత బాగుండాలంటే, దాన్నించి దూరంగా ఉన్నప్పుడు - ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోదామా అన్నంతగా మనసు తహతహలాడాలి.
  2. సంసారమంటే ఒంటరితనం నుంచి నమ్మకంలోకి ప్రయాణం.
  3. భార్యంటే - దారి తెలిసి, డ్రైవింగ్ తెలీని స్త్రీ.  భర్తంటే డ్రైవింగ్ తెలిసి, దారి తెలియని మొగాడు. అందుకే ఇద్దరూ 'కలసి' ప్రయాణం చెయ్యాలి.
  4. వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలా సార్లు ప్రేమలో పడటం.
  5. మిగతా అన్నిచోట్ల 'గెలవటం' విజయం. సెక్స్ లో 'గెలిపించటం' విజయం.
  6. రొమాన్స్ఒక ఉద్యానవనం లాటిది. కొంచెం దూరం వెళ్ళి చూసి 'బావుంది' కదా అనుకొని వెనక్కి వచ్చ్చేస్తే -ఆ అందం అక్కడితో ఆగిపోతుంది.
  7. రోమాన్స్ లో అవతలి వ్యక్తి మనని ఏం చెయ్యాలని, ఎలా తృప్తిపర్చాలని మనం ఆశిస్తున్నామో - అదంతా మనం కూడా అవతలి వ్యక్తి పట్ల చేసి చూపించాలి!! అదే పర్ఫెక్ట్ రోమాన్స్!!!
  8. మీరు లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరో ఒకరికి ప్రస్తుతం వారు ఉన్నంత ఆనందంగా ఉండే అదృష్టం వుండి ఉండేదికాదు.
  9. రైలుని కేవలం ప్రయాణ సాధనంగా వాడతారు కొందరు. కిటికీ లోంచి ప్రకృతిని మనసారా ఆస్వాదిస్తూ ప్రయాణిస్తారు కొందరు. రోమాన్స్ కూడా అంతే.
  10. 'నువ్వు అందంగా ఉన్నావు' అన్న నమ్మకాన్ని స్త్రీ లో కలిగిస్తే ఆమె అందంగా ఉండడం ప్రారంభిస్తుంది.
  11. నా భర్తకి శరీరాన్ని నీకు మనసునీ ఇస్తానన్న ఆడదాన్ని నమ్మకు. నా భార్యతో ఉంటూ నిన్ను ప్రేమిస్తానన్న మొగవాన్ని అస్సలు నమ్మకు.


విజయం వైపు పయనం

  1. భయంకలిగించే అడ్డంకులన్నీ, విజయం మీదనుంచి కళ్ళు తిప్పితేనే కనపడతాయి.
  2. "మంచివాళ్ళకే కష్టాలు వస్తాయి" చాలా పాత సినిమా డైలాగ్ ఇది. కష్టాలు వచ్చాయి కాబట్టి మనం మంచివాళ్ళం అనుకోవటం అంతకన్నా స్టుపిడిటీ.
  3. చాలామందికి 'పని చేస్తే అలసిపోతాం' అన్న దురభిప్రాయం ఉంది. పనిచేస్తే మనం అలసిపోము. ఎందుకంటే ఆ పని చేయకపోతే దాని బదులు ఇంకో పని చేస్తాం కాబట్టి.
  4. ఇతరుల తప్పులనుండి నేర్చుకోక తప్పదు. అన్ని తప్పులూ మనమే చేయటానికి సమయం సరిపోదు కాబట్టి.
  5. అన్ని రకాలుగా ప్రయత్నించి విఫలమైతే... ఇంకొక్కసారి ప్రయత్నించు.
  6. ఆలోచనల స్టాక్ కన్నా - మాటల అమ్మకం ఎక్కువైనప్పుడు జీవిత వ్యాపారంలో నష్టం తప్పదు.
  7. నిస్పృహ అంటే - నువ్వేం కోరుకుంటున్నావో  .. దాన్ని పొందటానికి నువ్వేం కోల్పోతావో...రెంటికి మధ్య తేడా. ఆ తేడా ఎక్కువ అయ్యేకొద్ది విచారం ఎక్కువ అవుతుంది. 'నిస్పృహ'కి  ఇంతకన్నా గొప్ప నిర్వచనం చెప్పటం కష్టం.
  8. ప్రారంభించటానికి ధైర్యం ఉండాలి. కొనసాగించటానికి కృషి ఉండాలి. పూర్తి చేయటానికి పట్టుదల ఉండాలి. ఈ మూడు స్టేజీల్లోనూ మొహం మీద చిరునవ్వు వుండాలి.
  9. గెలుపు గృహానికి పెరటి ద్వారముండదు. సింహాద్వారమే.
  10. విజయం అనేది ఒక సుదీర్ష యాత్ర - చిన్న పిక్నిక్ కాదు.


విజయానికి ఐదుమెట్లు
 

  1. "అతడొక వృత్తం గీసుకొని నన్ను బయటకు తోసేశాడు. నేనొక పెద్ద వృత్తం గీసి అతడిని అందులోకి ఆహ్వానించాను".
  2. ఆనందం'కోసం'  బ్రతకకు, ఆనందం'తో'  బ్రతుకు.
  3. మంచులో తడిసిన పూలని జీవితకాలంలో ఒకసారయినా చూడని వాడు ఈ ప్రపంచంలోకెల్లా పెద్ద దురదృష్టవంతుడు.
  4. 'ఇంతకన్నా కల్లో గంజో తాగటం మంచిది' అనుకుంటారు చాలామంది. ఓ పదిరోజులు అలా చేసాక, మొదటి జీవితం ఎంత బావుందో తెలుస్తుంది.
  5. మనుషులు మూడు రకాలు. నడిచేవాళ్ళు, నడవనివాళ్ళు, నడిపిచేవాళ్ళు.
  6. ఒక వ్యక్తికి ఎంతమంది శత్రువులుంటే అంతా గొప్పవాడి కింద లెఖ్ఖ. ఎంతమంది ఇష్టపడని వాళ్ళుంటే  అంత ఒంటరి కింద లెఖ్ఖ ఎంతమంది అసహ్యించుకునే వాళ్ళుంటే అంత నీచుడి క్రింద లెఖ్ఖ.
  7. ఈ ప్రపంచానికి జరుగుతున్నా హానిలో సగం - వార్తల్లో ప్రముఖంగా కనపడదామనుకునే వారివల్ల వస్తుంది.
  8. తానూ నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించేవాడు గొప్పవాడు. తన సిద్ధాంతం కన్నా గొప్పది కూడా ఇంకొకటి ఉండొచ్చు అని ఆలోచించేవాడు ఇంకా గొప్పవాడు.
  9. రచయిత కలం నెమలిపింఛంతో తయారు కాబడినట్లు ఉండాలి. ఎందుకంటే ఆతను అన్ని కళ్ళతో చూడగలగాలి.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!