04th Sep 2011 05:22 AM 3470 naren
నీ మనసు గెలవడానికి నేను కలం పట్టుకోలేదు,
నిన్ను మెప్పించడానికి కవిత రాయలేదు,
నీ దయ కోసం నేను గళం విప్పలేదు,
నా శోకం వినమని నేను గానం చేయలేదు,
నా ప్రేమను పదాలుగా మారుస్తూ కాలాన్ని కరిగిస్తున్నాను,…
నా మూగ గానంతో ప్రాణాన్ని ఖర్చుచేస్తున్నాను,…
-నరేన్
No Comments Posted Yet...Write First Comment!!!