కాఫీవిత్.‌‌..రమాదేవి పొయెట్రీ…697-ఎ.రజాహుస్సేన్

*కాఫీవిత్.‌‌..రమాదేవి పొయెట్రీ…697

“కనులు కనులతో కలబడితే, ఆ కనులకు
ఫలమేమీ.?
అంటే…
దానికి సమాధానం.‌.’ కలలే ’.!!
ఈ కవిత‌ కూడా కలలకు సంబంధించిందే..
రమాదేవి తన జానర్లోనే రాశారు..మీరూ చదవండి..!!

“ఈవేళ
అతనొక స్వాప్నికుడు
గడచిన కాలానికి
తనను ముడి వేసుకొని
గడుస్తున్న కాలానికి సమయం లేదని
పొల్లుపోని మాట ఒకటి చెబుతున్నాడు
అతనికై రంగుల కలలను
వదిలేసి వెళుతున్నా
నిశ్శబ్దంగా .....
అదేమి చిత్రమో
అన్ని రంగులు కలగలిసిపోయి
నలుపుగా మారి రాలిపోతున్నాయి
తడబాటు లేకుండా తడి తడిగా...
ఓయ్ స్వాప్నికుడా..
కాలానికి గాలంవేసి
నీకై చెదరని రంగుని
ఎక్కడ తెచ్చేది...
నా కలల రంగులనే
భాగాలుగా పంచుకుందాం
ఓయ్  ... రారాదూ
PLEASE ❤️”!!

*అర్.రమాదేవి.!!

అతగాడు ఓ స్వాప్నికుడు..కలలుకంటూ వుంటాడు.
అంతేనా..?
ప్రేమించిన ఆమెను  తన కలలతో గడిచిన కాలా
నికి ముడివేసుకున్నాడు..అంతవరకు బాగానే…
వుందికానీ,గడుస్తున్న కాలానికి సమయం లేదని
పొల్లుపోని మాటొకటి చెబుతున్నాడు..(అది నిజం
కాదు)
అతగాడి మాటలు విన్నాక…ఆమె ఏమనుకుందో..
ఏమో? గానీ…అతనికై రంగుల కలలను వదిలేసి
మరో మాట మాటాడకుండా,నిశ్శబ్దంగా…వెళ్ళి
పోయింది..!
అదేమి చిత్రమో గానీ,....
ఆ కలల్లో అన్ని రంగులూ కలగలిసిపోయి,
నలుపుగా మారి తడబాటు లేకుండా తడి
తడిగా...రాలిపోతున్నాయట…!
దానికి అతగాడేమనుకుంటాడో అని, ఆమె..
కలవరపడి ఇలా అంది..,
‘ఓయ్ స్వాప్నికుడా..!
కాలానికి గాలంవేసి,నీకోసం చెదరని రంగుని..
నేనెక్కడనుంచి తెచ్చేది’?
‘అందుకే…రా..!
నా కలల రంగులనే భాగాలుగా పంచుకుందాం!
ఓయ్!  ... నిన్నే…రారాదూ!..PLEASE ❤️”
అంటూ ప్రాధేయపడుతోందామె...!!

కలలు కనడం ప్రేమికుల లక్షణం..ప్రేమలో వుంటే
ఇద్దరికీ కలలు రావాలి..ఒక్కోసారి ఒకరికి కలలొచ్చి,ఇంకొకరికి రాకపోతే…ఒకరి కలల్ని ఇంకొకరు షేర్ చేసుకోవాలి..అతగాడికి వర్తమానంలో కలలుగనడానికి సమయం లేదట..అందుకే కలలు గనడం లేదంటున్నాడు..నీకు కలలు రాకుంటే యేం? నా కలలున్నయిగా రా..! పంచుకుందాం.! అంటోందామె..ప్రేయసీ ప్రియులంటే..”చెరి సగం”
అన్నదే ఈ కవిత సారాంశం.‌ఈ కవయిత్రి "రమాదేవి " భావన..!!

*ఎ.రజాహుస్సేన్…!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!