కాఫీవిత్ ఆర్ రమాదేవి…‌683 - ఎ.రజాహుస్సేన్..

*కాఫీవిత్ ఆర్ రమాదేవి…‌683

*అతడిది…తప్పుకు పోయేదారి…!
*ఆమెది…..పసిగట్టే  గడుసుతనం..!
*అతడి చిక్కుముడుల కథకు..‌‌…
ఆమె సొంతదారు….!!
ఇదో చిక్కుముడుల కథ..రమాదేవి మార్క్ కవిత ఒకే జానర్, ఒకే వస్తువు.‌ఒకే శైలి..వెరసి రమాదేవి
ఈ కవిత కూడా ఆ తానులోదే, కాకుంటే,… కొంచెం
‘చిలిపిదనం’, ఇంకొంచెం.‘గడుసుదనాన్ని దట్టించి నూరారు.‌ ఈరోజు మన కాఫీ‌టైమ్ కవిత ఇదే..?
మీరూ ఓ సారి చదవండి..!

“అతను చడిచప్పుడు కాకుండా
తలుపు వెనక తలుపు
మూసేసి వెళుతున్నాడు....
విని విననట్టుగా ఆ వైపుకే చూస్తున్నా...
కారణమేమీ లేదంటూనే
అడుగు ఇటువేయ
సమయం చిక్కడం లేదంటూ...
కలవరపాటు కథలేవో చెప్పుతూ
చప్పుడులేని గడియలు వేస్తున్నాడు...
ఓయ్
నిశ్శబ్దంగా నీవు ఎటువైపు వెళ్ళినా
గడియతో పనిలేని గడుసుతనం
కోరి అరువు తెచ్చుకోనా...
తప్పుకుపోయే దారి కనుమరుగు చేసి
కొత్తదారి ఒకటి వెతికి ఎదురు నిల్చోనా?
ఏమోయ్..!
చిక్కుముడుల కథ గుర్తుందా
ఎపుడో నువ్వు శ్రీకారం చుట్టిన కథకు
ఇపుడు సొంతదారు నేనే కదటోయ్!…!!
             ❤️ ఆర్.రమాదేవి..!!

ఒకదృశ్యం..నిజానికి అదేమీ కనబడేది(Visual)
కాదు.కానీ పాఠకులకు కనబడేలా వుంటుంది..
లేనిది వున్నట్టు వూహించుకోవడం రమాదేవి కవి
త్వంలో ప్రధాన లక్షణం.‌ఇక్కడా అదే ఊహ.కాకుం
టే అదృశ్యాన్ని దృశ్యమానం చేసి గడుసు శిల్పం…
కనిపిస్తుంది..ఈ కకవిత చదవగానే గుండెలో చేప
ముల్లు కసుక్కున గుచ్చుకున్న ఫీలింగ్ కలిగింది..
అయితే,..అది భరించలేని బాధకాదు..తీపి బాధ..
ఈ కవయిత్రి రమాదేవి అక్షరాలకు మాత్రమే సొంత
మైన గడుసుదనపు చమత్కృతి మహిమ అది..!!
సినిమాలో స్క్రీన్ ప్లేలా జాగ్రత్తగా ఓ చిన్ని కవితలో దృశ్యాన్ని కళ్ళముందునిలపడం చాలా కష్టం….
ఆ పనిని రమాదేవి చాలా సులువుగా చేశారు..!!

ఇక తిలకించండి….;
అతగాడు.. చడీ చప్పుడు కాకుండా తలుపు వెనక తలుపు మూసేసి వెళుతున్నాడు…ఆమె చూడటం
లేదని,అసలు గమనించడమే లేదని అనుకుంటున్నాడు..ఆమె మాత్రం తీసిపోయిందా ఏమిటీ?
అతగాడికంటే..రెండాకులు ఎక్కువే చదివింది. ఆమె…వినీ విననట్టుగా..‌చూసీ చూడనట్టుగా
ఆ వైపుకే చూస్తోంది…‌
అబ్బే ! కారణమేమీ లేదంటూనే,అతగాడు.. అటు
అడుగు ఇటువేయ సమయం చిక్కడం లేదంటూ...
కలవరపాటు కథలేవో చెప్పుతూ చప్పుడులేని గడి
యలు వేసుకుంటూ పోతున్నాడు‌..

ఆమెకు చిర్రెత్తుకొచ్చింది..‌
ఓయ్ …!
‘నిశ్శబ్దంగా నీవు ఎటువైపు వెళ్ళినా,గడియతో పని
లేని గడుసుతనం కోరి అరువు తెచ్చుకోనా’.?
తప్పుకుపోయే దారి కనుమరుగు చేసి, కొత్తదారి
ఒకటి వెతికి ఎదురు నిల్చోనా?అనుకుంది లోలోనే.
అతగాడి వేషాలకి ఇంక ఆపుకోలేకపోయింది..
“ఏమోయ్..!
చిక్కుముడుల కథ నీకు గుర్తుందా?
ఎపుడో నువ్వు శ్రీకారం చుట్టిన కథే అది…
కాకుంటే… ఇప్పుడు  సొంతదారునేనయ్యా.
అది మరేదో కాదు….
నీవునేర్పిన విద్యే నీరజాక్షా  ! అన్నట్లు చూసిందామె..!
అలా…
అతగాడి చిక్కుముడుల కథను ఎంచక్కా….‌.
విప్పిచెప్పిందామె..ఆగడుసుతనానికి ఖచ్చితంగా అతగాడు ఖంగు తినివుంటాడు..
చిక్కుపడిన జుత్తును దువ్వెపనతో దువ్వి,పాపిట తీసి ,సుతారంగా జడేసినట్లు..‌ఎప్పుడో అతగాడు
శ్రీకారంచుట్టిన కథకు భాష్యం చెప్పిందామె…!
Any Doubt…??

*ఎ.రజాహుస్సేన్..!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!