8:41
100%
3
neccheli.com/2
:
ప్రేమ పల్లకి
ప్రేమ మైదానంలో ఓటమి ఎరుగని ఆట ఆడడం అంత తేలిక కాదు. అటువంటి ఆటని పదాల మాయాజాలంతో, గమ్మత్తయిన హృదయ గమకాలను పలికిస్తూ మనసు లోని తెరలని దించడం ఈ కవయిత్రి కవితలకి అలవాటు.
మనిషిని గెలిచి మనసుని గెలుస్తావా!! మనసును గెలిచి మనిషిని గెలుస్తావా!! అని ఇక్కడ ఓ ప్రశ్న వినపడుతుంది.
ఎంతసేపు మనసు ఓ లోలకాన్ని మోస్తూ ఉంటుంది. .. పరిగెత్తుకెళ్లే కాలంతో పోటీ పడుతూనే.. జ్ఞాపకాల దొంతరలను క్వింటాళ్ల కొద్దీ వెంట తీసుకొస్తుంది. ఎడారి దారుల్లో నీటి చెల్లమల్లా ఎందరికో మనసు దాహన్ని తీరుస్తాయి ఈ కవితలు.
హృదయ కమండలాన్ని చేతపుచ్చుకొని విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేస్తున్నట్టు మేనక సోయగాలు అద్దుకున్న సుమధుర కవితా వాక్యాలలో మొత్తం ప్రేమ సారాంశమే.
మరి ఇంతటి "ప్రేమ" ప్రవాహంలాగా ఎక్కడ నుంచి వస్తోంది. ఈ ప్రేమలో చేదు గుళికలు ఏమీ ລ້...!?
8:41
100%
ఎక్కడో ఒక్క దిగులు గూడు అయినా తగలలేదు అంటారా..!?
లేదనే చెప్పాలి. వెన్నెల తన చల్లదనాన్ని పరిచినట్టు... ఆకాశమంత ప్రేమ పరుచుకునే ఉంటుంది.
విచిత్రం ఏంటంటే మనకి ఎక్కడ నిరాశో, నిట్టూర్పో, నిస్పృహ కనిపించదు. పైగా ఈ కవితల్లోని ప్రేమ 'విరోధాభాసని' పోలి ఉంటుంది.
ఇక్కడ ప్రేమ మనతో మాట్లాడుతుంది ప్రేమ మాత్రమే మాట్లాడుతుంది ఆ ప్రేమ ఏమంటుందో చూద్దాం.
నేను ప్రేమించకుండా ఉండలేను అంటుంది,.
నువ్వు దరి చేరితే ఆ ప్రేమను నేను మోయలేను అంటుంది,.
నువ్వు నన్ను దూరంగా ఉంచాలి అంటుంది., నువ్వు దూరం వెళ్ళిపోతే తట్టుకోలేను అంటుంది.,
నేను మాత్రమే ప్రేమించాలి అంటుంది., నువ్వు 1 ప్రేమించితే నేను భరించలేను అంటుంది.
ఇదో ఏకపాత్రాభినయంలా ఉంటుంది.
8:41
100%
ప్రేమించిన ప్రేమికుడు కావాలి. అందుకే అతని కోసం వెతుకుతుంది. అతని కోసం నిరీక్షిస్తుంది..
అతను వెళ్ళిన దారిలో వెతుకుతూ వెళ్లే చూపులకు అందని ఆ వీధి మలుపు పొడవు కొలవలేనంత.
ఎక్కడ అతని జాడ దొరకలేదని యుటర్న్ తీసుకొని ఎక్కడైతే వదిలేసిందో ఆ ప్రేమను వెతుకుతూ అక్కడికే చేరుకుంటా అంటుంది. కానీ అక్కడ నువ్వు లేవు, ఉండవుగా అంటు నిందిస్తుంది.
నీ ప్రేమ కోసమే నేను వేచి ఉండే రాక్షసిని అంటుంది.
ఒక్కోసారి పుస్తకాల అలమరా దులుపుతూ ఉంటే నీ జ్ఞాపకాలన్నీ వచ్చి నాలో నిండిపోయాయి అని చెప్తుంది.
నువ్వు నన్ను మర్చిపోవడానికి వీల్లేదు అంటుంది.
నువ్వు వద్దు అన్నా నీ వెంటే నడిచొస్తా అంటుంది.,
↑
నువ్వు మోయలేనంత ప్రేమని నీకు ఇస్తా అంటుంది.
8:41
100%
మరి అంత నిస్వార్ధమైన ప్రేమ మనలో ఉంటుందా...!! అలా ప్రేమించ గలమా..!!
నిస్వార్ధంగా ప్రేమించాలి, మన ఇష్టాన్ని మనము ప్రకటించుకోవాలి. మనల్ని మనం గౌరవించుకోవాలి., అదే స్థానంలో ఎదుటి వ్యక్తికి ఆ అవకాశాన్ని ఇవ్వాలి. పరిదులులేని ప్రేమ నువ్వు ఇవ్వగలిగితే నీ ప్రేమ ఎప్పటికీ తిరస్కరించబడదు అనే సందేశం మనకి ఈ కవితల్లో అందుతుంది.
అయితే ఇక్కడ ప్రేమ అతడు ఒక్కడిదే కాదు లేదు ఆమె ఒక్కదానిదే కాదు...
ఈ కవయిత్రి తన చుట్టూ ఉన్న ఆవరణలోని అన్ని పాత్రల్లో కూడా అనంతమైన ప్రేమను చూస్తుంది. ప్రేమించగలగడం ఓ గొప్ప వరం అంటుంది. నేను పంచ వలసినది ప్రేమ మాత్రమే అని అద్భుతంగా పంచేస్తుంది. ప్రేమ పంచడంలోని మాధుర్యాన్ని ఎవ్వరైనా అనుభవించాలి అని చెప్తుంది.
ప్రేమని అందుకోవాలని అందరూ ఆరాటపడతారు, ఆశపడతారు నన్ను ఎవరైనా ప్రేమిస్తే బావుండు అనుకుంటారు. కానీ మనుషుల్ని మన మనిషిగా మనం ఎంత ప్రేమిస్తున్నాం అనే సంగతిని మర్చిపోతుంటాం. ఆ మర్చిపోయిన దాన్ని గుర్తు చేసేది "వెన్నెల దుప్పటి కప్పుకుందాం" పుస్తకంలోని కవితలు
18:41
100%
ప్రేమ పంచినప్పుడు కలిగే ఆనందము తీసుకున్నప్పుడు కలగదు అని చెప్పడం ఈ పుస్తకంలోని కవితల్లోని విశేషం. ఇలాంటి అపురూపమైన ప్రేమ కవితలు అందించడంలో కవయిత్రి రమాదేవి గారి హస్తలాగవంలోని నేర్పు చిన్నది కాదు.
"వెన్నెల దుప్పటి కప్పుకుందాం" పుస్తకం నిండా 90 దాకా కవితలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి చదివే అప్పుడు ఒక దీర్ఘ కవితలా అనిపిస్తుంది. ఒకే ఎక్స్ప్రెషన్ ని అనేక రకాలుగా విశ్లేషిస్తూ వర్ణించి చెప్పడం ఇందులో ప్రత్యేకత. రమాదేవి తన ముందు మాటలో ఒక మాట చెప్పారు. 'ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఏదో కవిత దగ్గర మీ అతడు లేక ఆమె ఎదురవకపోతే నన్ను అడగండి' అంటుంది.
అభినందనలు రమాదేవి గారు.
ఇలా "వెన్నెల దుప్పటి కప్పుకుందాం” పుస్తకంలోని పాజిటివిటీని అందుకుం టారని ఆశిస్తూ... నేటి ఈ తరం నడక.
8:41 100% *** మరి ఇంత ప్రేమను అందించే ప్రేమని ప్రేమగా ఎవరందుకోవాలనుకోరు చెప్పండి. కానీ, తిరకాసంత ఇక్కడే ఉంటుంది. ఆ ప్రేమని అందుకోవడానికి ఆ ప్రేమే వెనక్కి తిరిగి తన చెంతకు వస్తానంటే మాత్రం ఈ ప్రేమ బంగారం “నాకొద్దు నీ ప్రేమ అంటుంది" "నేను ప్రేమించాలి నిన్ను” 'నువ్వు కాదు నన్ను ప్రేమించేది' అని చెప్తుంది నాకు ప్రేమను ఇవ్వడం మాత్రమే తెలుసు అని చెప్తుంది. తీసుకోవడం నా తరం కాదంటుంది. ప్రేమ చాలా బరువైంది అది ఇవ్వడంలో ఉండే సంతోషం తీసుకోవ డంలో ఉండదు అంటుంది. "Whenever you expect love from anyone you can lose that persons real love" ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామని మనల్ని ప్రేమించమని మనం అడగడంలోనే మన ప్రేమను కోల్పోతామని,. ↑ మరి అంత నిస్వార్ధమైన ప్రేమ మనలో