ఇది ఏ రాగం 2


ఇది ఏ రాగం మొదటి భాగం లో కొన్ని రాగాలు, ఆ రాగంలో పాటలు పరిచయం చేసా కదా. ఇంకా కొన్ని రాగాలు ఉన్నాయి. అందులో బిలహరి రాగం, ఈ రాగం ఎక్కువగా పద్యాలకి వాడతరట. బిలహరి రాగం అనగానే మనకి "రుద్ర వీణ " చిత్రం లో చిరంజీవి తండ్రి గా నటించిన జెమినీ గణేశన్ గారి పాత్ర గుర్తుకు రాక మానదు. అందులో ఆయన ఆ రాగానికి తెచ్చినగుర్తింపు కారణం గా ఆ రాగం ఆయన ఇంటి పేరు అవుతుంది. ఇంకా పద్యాలు అనగానే "దాన వీర శూర కర్ణ" చిత్రం లో పద్యాలు గుర్తుకు వస్తాయి.  తిరుపతి వేంకట కవులు రచించిన పద్యాలను రామకృష్ణ గారు ఆలపించారు. చెల్లియో చెల్లకో, బావా ఎప్పుడు వచ్ఛితీవు, అజాత శత్రువే అలిగిన నాడు వంటి పద్యాలు ఆంధ్ర దేశం లో అప్పుడు ఇప్పుడు సుపరిచితాలు.


6. భూపాల రాగం :

తొలి సంజే వేళలో                                                  ( సీత రాములు, బాలు, సుశీల, సత్యం)

7. కాపీ రాగం:

నా చెలి రోజావే                                                      ( రోజా, బాలు, ఎ.ర్.రెహ్మాన్)
వట పత్ర శాయి కి వరహాల లాలి                                 ( స్వాతి ముత్యం, సుశీల, ఇళయరాజా)

8. బిలహరి రాగం:

ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు                                 ( ఈనాటి ఈ బంధమేనాటిదో, సుశీల, రాజేశ్వర రావు)
మాదీ స్వతంత్ర్య దేశం                                            ( ప్రవేటు రికార్డు, టంగుటూరి సూర్య కుమారి, రజని)

9. దర్బారీ కానడ రాగం:

నమో భూత నాధా                                              ( సత్య హరిశ్చంద్ర, ఘంటసాల, ఎస్. వరలక్ష్మి, ఘంటసాల)
శివ శంకరీ శివానంద లహరి                                   (జగదేక వీరుని కథ, ఘంటసాల, పెండ్యాల)

10. యెమన్ రాగం:

ఎవరివో నీవెవరివొ                                                ( పునర్జన్మ, సుశీల, ఎస్. రాజేశ్వర రావు)
పలకడలి లో శేష తల్పమున                                  ( చెంచు లక్ష్మి, సుశీల, ఎస్. రాజేశ్వర రావు)

11. తిలాంగ్ రాగం:

నా చందమామ                                                   ( పాండవ వనవాసం, ఘంటసాల, సుశీల, ఘంటసాల)
నీలకంధరా దేవా                                                 ( భూకైలాస్, ఘంటసాల, సుదర్శనం, గొవర్ధనమ్)

12. హిందోళ రాగం :

ఓం నమః శివాయా                                               ( సాగర సంగమం, జానకి, ఇళయరాజా )
మనసే అందాల బృందావనం                                   ( మంచి కుటుంబం, సుశీల, కోదండపాని)
కలనైనా నీ తలపె                                                ( శాంతినివాసం, లీల, ఘంటసాల )


పైన చెప్పిన పాటలు చూడగానే ఒక్కసారైనా మనసులో తలుచుకుని ఉంటాం. అందులో రచన, సంగీతం ముఖ్య పాత్ర పోషించాయి. పాటలు అర్ధవంతంగాను ఉంటాయి. ఎంతో మంది మహానుభావులు వాటికీ ప్రాణం పోశారు. నాకు నచ్చిన గాయకులు సుశీల, ఘంటసాల, రాజా మరియు బాలు గారు. వారిని చూస్తే దేవతలు మనుషులై వచ్చినట్టు ఉంటుంది.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!