తనకెప్పుడూ అపరిచితురాలినే....

అతను
ఒకనాటి వెన్నెల మొగ్గ
వేలసంవత్సరాలనాటి
జ్ఞాపకాలు దోసిట నింపాడు

యే దేశాన రాలిన నక్షత్రమో
అరుదైన మనసు మాటలరాశి
నాకై  మిగుల పోగు పెట్టాడు

అతను
తెలిసిన కథలోని
తెలియని మలుపు...
రాయని పాటలకు
వేసే దరువు...

తననువీడి
రాలిన చిరు సవ్వడుల
నగవుకి ఎపుడూ బంధీనే ....

అయినా చిత్రమే
కదలి వచ్చిన వసంతానికి
రాలిపోయిన వేపపూవులా

నేను తనకెప్పుడూ
అపరిచితురాలినే....
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!